మోడీ హెలికాఫ్టర్ ఎగురుతుంటే నల్ల బెలూన్లు ఎగరవేయంటపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. చట్టంలేని అంశాలను ప్రస్తావిస్తూ దమ్ము ధైర్యం లేకుండా కొందరు పిరికివాళ్లు చేస్తున్న పనులు ఇవని సోము వీర్రాజు అగ్రహం వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీ ఏం మాట్లాడుతుందో తమకు తెలుసన్న సోము వీర్రాజు రాష్ట్ర అంశాల పై బహిరంగ చర్చకు సిద్దమని సవాల్ విసిరారు.